1. అబ్బా నీతోటి వేగలేనమ్మా, ఓ మనసా...



అబ్బా ! నీతోటి వేగలేనమ్మారో మనసా -2
ఎందుకొచ్చిన తంటా మనము వేరుబడదాము మనసా
అబ్బా నీతోటి వేగాలేనమ్మారో మనసా

ఎంతో గంభీరముగా బ్రహ్మమే నేనంటావు
సుంత సందేహములేదు సుఖరూపి నంటావు - 2
అంతలోనే  హాఁ... కష్టమని అల్లాడుతుంటావు - 2

ఇంత మతిమరుపు దానితో ఇమడలేనమ్మారో మనసా
అబ్బా నీతోటి వేగలేనమ్మారో మనసా

కూడి ఆరు శత్రువులతో క్రీడించు చుంటావు
మూడు లోకములందుండే మురికితో నిండావు
మూఢముగా బహుకర్మలలో మునుగుచు వుంటావు
కీడు మేలెరుగని నీతో, జోడి కుదరాదు మనసా

అబ్బా నీతోటి వేగలేనమ్మారో మనసా
ఎందుకొచ్చిన తంటా మనము వేరుబడదాము మనసా