ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం

          ఓం గురు
          జయ గురు
          జయ జయ గురు ఓం

ఎన్నడు నీ దయ వచ్చుననుచు 
ఎదురెదురు చూతు గురునాథా
కన్నడ చేయక మన్ననతో నను 
కరుణ జూడు గురునాథా
                                      || ఎన్నడు నీ దయ ||
కుతుకముతో నా గతి నీవే యని
కొలచు చుంటి గురునాథా
పతితుడనని నను విడచుట నీకది
పాడికాదు గురునాథా
                                      || ఎన్నడు నీ దయ ||
సారహీన సంసార జలధి
వేసారినాడ గురునాథా
సార రహితమగు జీవితమునకొక
దారి చూపు గురునాథా
                                      || ఎన్నడు నీ దయ ||
గమ్యస్థానము బహుదూరముగా
కాన్పిన్చేను గురునాథా
సౌమ్యమార్గమున నన్నచటికి
కొనియేగుము గురునాథా
                                      || ఎన్నడు నీ దయ ||
          ఓం గురు
          జయ గురు
          జయ జయ గురు ఓం
ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం